గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిస్తే మరికొంతమంది ఇక రిషబ్ పంత్ పై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే రిషబ్ పంత్ బ్యాటింగ్ లో విఫలమవడం పై టీమిండియా బ్యాటింగ్ కోచ్  సంజయ్ బంగర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాగానే రిషబ్ పంత్ కి కూడా సరికొత్తగా అవకాశం ఇవ్వాలి అంటూ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. టెండూల్కర్ సైతం మిడిలార్డర్ నుండి ఓపెనర్ గా మార్చిన తర్వాత గొప్పగా రాణించాడని ఇక రిషబ్ పంత్ ను కూడా ప్రస్తుతం ఓపెనర్ గా మారిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే ఓ క్రీడా ఛానల్ లో జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ ని ఓపెనర్ గా మార్చాలని మూడేళ్లుగా అనుకుంటున్నా అంటూ సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు. ఒకసారి సచిన్ టెండూల్కర్ కెరీర్ పరిశీలించుకుంటే మిడిలార్డర్లో కంటే న్యూజిలాండ్ పర్యటనలో ఓపెనర్ గా మారిన తర్వాత అతను అద్భుతంగా రాణించాడు.


 అందుకే రిషబ్ పంత్ ని కూడా ఓపెనర్గా అవకాశం కల్పిస్తే ఇండియాకు అద్భుత ఫలితాలు ఉంటాయి అంటూ ఒక క్రీడా చర్చ  సందర్భంగా చెప్పుకొచ్చాడు సంజయ్ బంగర్. ఇక ప్రస్తుతం ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఇక బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడని.. కానీ దీర్ఘకాలం గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్ ఓపెనర్ గా సరిపోతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇదే సమయంలో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం  సంజయ్ బంగర్ వ్యాఖ్యలను సమర్థించాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: