టి20 మ్యాచ్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్నది కూడా అర్థంకానీ  విధంగానే ఉంటుంది. అంతే కాకుండా ఏ బంతికి  మ్యాచ్ మలుపు తిరుగుతుంది అన్నది తెలియని విధంగానే ఉంటుంది. అందుకే ఇక టి20 మ్యాచ్ వస్తోందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో భాగంగా ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ లు జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది.


 ఇక టీ20 బ్లాస్ట్ లో భాగంగా ఇటీవల సోమర్సెట్ సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ఉత్కంఠ తో ప్రేక్షకులను  మునివేళ్ళపై నిలబెట్టింది అని చెప్పాలి. ఏకంగా చివరి ఓవర్ వరకు కూడా విజయం ఎటువైపు వెళుతుందన్నది ఊహకందని విధంగా మారుతుంది. ఒకానొక దశలో సోమర్సెట్ వైపు మ్యాచ్ సాగుతున్నట్లు కనిపించిన.. చివరికి సర్రే జట్టు విజయం సాధించింది సోమర్సెట్  తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ చివరి ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి హీరో అనిపించుకున్నాడు చివరి బంతికి మాత్రం అతను జట్టు విలన్ గా మారిపోయాడు. సర్రే జట్టు సోమర్సెట్ కి 145 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది అయితే చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు మిగిలి ఉండటంతో మ్యాచ్ సర్రే జట్టు చేతుల్లోనే ఉంది అని అందరూ అనుకున్నారు.  ఇలాంటి సమయంలో ఇక చివరి ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన  పీటర్ సిడిల్ ఐదు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. దీంతో ఇక మ్యాచ్ లో సోమర్సెట్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి బంతికి అతను చేసిన పొరపాటు చివరికి ప్రత్యర్థి సర్రే జట్టును గెలిపించింది. చివరి బంతిని యార్కర్ వేయడానికి ప్రయత్నించగా బంతి ఓవర్ పిచ్ అయ్యింది. దీంతో బ్యాట్స్మెన్ కవర్స్ వైపు ఫోర్ కొట్టడంతో సర్రే మ్యాచ్ విజేతగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: