టీ-20 ఫార్మెట్లో టీమిండియా మరో సారి తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనలో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రతిభ కనపరిచినా యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు.  ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి అటు సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు సొంతగడ్డపై ఐర్లాండ్ జట్టును వైట్వాష్ చేసింది టీమిండియా. ఈ క్రమంలోనే టీమిండియా అద్భుత ప్రదర్శన పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 అయితే ఇక ఇటీవల జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఏకంగా 225 పరుగులు చేసింది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రత్యర్థి జట్టుకు ఏకంగా 226 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. ఇక ఆ తర్వాత ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించినటు గానే కనిపించింది అని చెప్పాలి. ఇకపోతే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన భారీ స్కోరు చేదించేటట్లు గానే కనిపించింది ఐర్లాండ్ జట్టు. ఇక 221 పరుగులు సాధించింది అని చెప్పాలి. దీంతో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.


 ఇకపోతే ఇటీవల టీమిండియా టి-20లో ఐర్లాండ్ పై విజయంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది అని చెప్పాలి. ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు చేసిన జట్టుగా భారత జట్టు నిలిచింది. అంతేకాదు టీ20 లో ఎక్కువ సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టు గా కూడా టీమిండియా కొనసాగుతుండటం గమనార్హం. ఇటీవలే ఐర్లాండ్  తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో 225 పరుగులు చేసింది టీమిండియా. దీంతో ఏకంగా 21 సారి ఏడు వందలకు పైగా స్కోరు చేసిన జట్టు గా మారుతుంది. ఇక భారత్ తర్వాత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్లు ఎక్కువసార్లు టీ20 లో 200కు పైగా స్కోర్లు చేసిన జట్లుగా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: