ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కి ఎవరూ ఊహించని విధంగా జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్గా మారిపోయాడు. అప్పటివరకు కెప్టెన్సీలో కాస్త అయినా అనుభవం లేని జస్ప్రిత్ బూమ్రా ఇక టీమిండియాను ఎలా ముందుకు నడిపించ పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇక టెస్ట్ సిరీస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్లో భాగంగా జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి పరుగులు చేసాడు.


 అదేంటి బుమ్రా బౌలర్ కదా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి పరుగులు చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. నిజంగానే బుమ్రా ఇది చేసి చూపించాడు. ఇన్ని రోజుల వరకు కేవలం బౌలింగ్ లో మాత్రమే అదరగొట్టిన జస్ప్రిత్ బూమ్రా ఇక ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా తన బ్యాటింగ్ లో తన సత్తా ఏంటో కూడా చూపించాడు. సిక్సర్లు  ఫోర్లతో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ లాగా అటు ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఒకే ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. ఇక ఎక్స్ ట్రా రన్స్ తో కలిపి ఒకే ఓవర్లో 35 పరుగులు వచ్చాయి అని చెప్పాలి. అయితే బుమ్రాకు వేసింది అనుభవం లేని బౌలర్ అనుకుంటే మాత్రం పొరబాటే.. ఎందుకంటే క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న స్టువర్ట్ బ్రాడ్ బుమ్రాకు బౌలింగ్ చేసాడు.


 ఈ క్రమంలోనే జస్ప్రిత్ బూమ్రా ఒక అరుదైన రికార్డును సాధించాడు. 2003లో జోహన్నెస్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా బౌలర్ ఆర్. పీటర్సన్ బౌలింగ్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. ఇక ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు కావడం గమనార్హం. ఒక బౌలర్ అయినా బుమ్రా ఒకే ఓవర్ లో 29  పరుగులు సాధించి దిగ్గజం లారా రికార్డును బద్దలు కొట్టాడు. కాగా టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ అయింది అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ 146 రవీంద్ర జడేజా 104 పరుగులు సెంచరీలతో చెలరేగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: