బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించి ఒకే ఓవర్లో 29 పరుగులు చేసిన జస్ప్రిత్ బూమ్రా.. బౌలింగ్ లో కూడా కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్ లో కూడా జస్ప్రిత్ బూమ్రా అందుకున్న క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి. ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మంచి ఊపు మీద ఉన్నాడు. 36 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉండటం గమనార్హం. అయితే ఇక బెన్ స్టోక్స్ ఎంతో దూకుడుగా వెళుతున్న సమయంలో బుమ్రా అదిరిపోయే క్యాచ్ తో అతని పెవిలియన్ పంపించాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో శార్దూల్ ఠాకూర్ 38 ఓవర్ వేసాడు. ఓవర్ లో భాగంగా నాలుగో బంతిని బెన్ స్టోక్స్ ఫోర్ కొట్టెందుకు ప్రయత్నించాడు. ఇక ఫీల్డర్ లేని చోట బెన్ స్టోక్స్ షాట్ కొట్టాడు. కానీ అటు జస్ప్రిత్ బూమ్రా మాత్రం ఏకంగా అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో క్యాచ్ ఒడిసి పట్టాడు. ఈ క్రమంలోనే అటు బూమ్రా క్యాచ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెయిర్ స్ట్రో కూడా షాక్ అయ్యాడు. చివరికి బెన్ స్టోక్స్ ఎంతో నిరాశతో వెనుదిరిగారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.