ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా మొదటి అడుగులోనే తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. జులై 1వ తేదీ నుంచి జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించలేకపోయింది. ఐదవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి చారిత్రాత్మక విజయం సాధిస్తుంది అనుకుంటే డీలా పడిపోయింది టీమిండియా. ఇలా టెస్టు మ్యాచ్ లో ఓటమి తో అభిమానులను నిరాశపరిచిన టీం ఇండియా ఇక ఇప్పుడు టీ20 సిరీస్ లో మాత్రం అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ జట్టును సొంతగడ్డపైనే ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడంతో ఓటమి బాధ నుంచి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది. కాగా నేడు కీలకమైన మరో టి20 మ్యాచ్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇక ఈ టి 20 మ్యాచ్ జరగబోతోంది. అయితే మొదటి మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ సాధించిన రోహిత్ సేన ఇక రెండవ మ్యాచ్లో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తూ ఉంది. అదే సమయంలో మొదటి మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసిన  ఇంగ్లాండ్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో రెండో మ్యాచ్ లో  మాత్రం విజయం సాధించాలని చూస్తోంది.



 దీంతో నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారబోతుంది అన్నది మాత్రం అర్థమవుతోంది. కాగా నేడు సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ సిక్స్ లో లైవ్ మ్యాచ్ చూడవచ్చు. మరోవైపు తొలి టి20 కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా,రిషబ్ పంత్,  జస్ప్రిత్ బూమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్లు  జట్టుతో కలిసారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మరింత పటిష్టంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అటు టీమిండియాను ఓడించడం అంత సులభమేమీ కాదు అంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: