భారత్ , పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కొన్ని దశాబ్దాల నుంచి దాయాది దేశాల గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా ఎప్పుడూ పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే కేవలం దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు ఇక ఈ వైరం  క్రీడలలో కూడా కొనసాగుతుంది అని చెప్పాలి. భారత్ పాకిస్థాన్ జట్ల కు సంబంధించిన ఆటగాళ్లు మైదానంలో ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికి ఒకరు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ విజయం విషయానికి  వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై విజయం సాధించాల్సిందే అనేక స్థితిలో ఉంటారు.


 క్రికెట్ మ్యాచ్ మొదలుకొని ఇక భారత్ పాకిస్థాన్ మధ్య ఎలాంటి క్రీడలలో మ్యాచ్ జరిగినా కూడా అది హై వోల్టేజ్ మ్యాచ్గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అసలు క్రీడలు అంటే ఇష్టం లేనివారు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్  వీక్షిస్తూ ఉంటారు. ఇరు దేశాల ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఏదో తెలియని స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇకపోతే  ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.


 కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ రెండు జట్లకు కూడా ఇది రెండో మ్యాచ్ కావడం గమనార్హం. అంతకుముందు భారత్ ఆస్ట్రేలియా చేతిలో.. పాకిస్తాన్ బార్బడోస్ చేతిలో  ఓడిపోయాయ్. ఇక రెండో మ్యాచ్లో గెలవాలన్న కసితో రెండు జట్లు ఉన్నాయి. దానికి తోడు చిరకాల ప్రత్యర్థి తో మ్యాచ్ కావడంతో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక భారత జట్టు గెలవాలని టీమిండియా అభిమానులందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: