మరికొన్ని రోజుల్లో మినీ ప్రపంచ కప్ గా  పిలువబడే ఆసియాకప్ జరగబోతుంది. 27వ తేదీన యూఏఈ వేదికగా మొదటి మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి మొత్తం అటు ఆసియా కప్లో భాగంగా జరగబోయే రెండో మ్యాచ్ పైనే  ఉంది అని తెలుస్తుంది.  అంటే దాయాది దేశాల గా పిలుచుకునే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది ఆగస్టు 28న ఈ మ్యాచ్కు ఉండనుంది.  అమీతుమీ తేల్చుకునేందుకు ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయ్.



 ఇక స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గంటలకొద్దీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తూ ఉన్నారు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఒక పని భారత్ అభిమానులను కలవరానికి గురి చేసింది. ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్కూటర్ నడుపుతూ కాలక్షేపం చేశాడు. అయితే ఇది మీరు అనుకుంటున్న స్కూటర్ కాదు.  ఏకంగా కాలితో నెడుతూ ముందుకు వెళ్లే స్కూటర్. ఒక స్కేట్బోర్డ్ తరహాలో ఇది ఉంటుంది. దీనిని కాలితో నెడుతూ ముందుకు నడపాల్సి ఉంటుంది.


 ఇక ఇలా ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ స్కూటర్ నడుపుతూ కనిపించాడు.. ఇది చూసిన అభిమానులు కాస్త కలవరానికి గురయ్యారు. ఎందుకంటే ఒకవేళ రోహిత్ శర్మ నడుపుతూ గాయపడితే ఆసియా కప్లో భాగంగా కీలకమైన పాకిస్థాన్తో మ్యాచ్లో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని.. కీలకమైన మ్యాచ్ కు ముందు  ఇలాంటి సాహసాలు చేయడం ఎందుకు అంటూ ఎంతో మంది అభిమానులు భావించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: