మొన్నటి వరకు ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో మాత్రం మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చినట్లుగానే కనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే సూపర్ సెంచరీతో చెలరేగి సిక్సర్లు ఫోర్లు తో వీరవిహారం చేసాడు. ఈ క్రమంలోనే 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చి సెంచరీ సాధించడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి కొత్త చర్చ మొదలైంది. విరాట్ కోహ్లీనీ వరల్డ్ కప్ లో కూడా ఓపెనర్గా బరిలోకి దింపుతున్నారా అని.


 గతంలో ఆఫ్ఘనిస్తాన్ తో   జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. కేఎల్ రాహుల్  కాస్త అసహనం వ్యక్తం చేయడం కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విరాట్ కోహ్లీనీ ఓపెనర్గా బరిలోకి దింపే అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.


 టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో తమకు మూడో ఓపెనింగ్ ఆప్షన్ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విరాట్ కోహ్లీనీ దృష్టిలో పెట్టుకొని మేము వరల్డ్ కప్ లో 3వ ఓపెనర్ తీసుకోలేదు. గతంలో  ఆర్ సి బి తరఫున ఓపెనింగ్ చేసి అద్భుతంగా రాణించాడు. కేఎల్ రాహుల్ క్వాలిటీ ప్లేయర్. వరల్డ్ కప్ లో నాతోపాటు అతడు ఓపెనింగ్ చేస్తాడు. కేఎల్ రాహుల్ జట్టులో ఉండడం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. వీరిద్దరిలో ఎవరైనా గాయ పడితే అప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: