కొన్నేళ్ల నుంచి జట్టులో అసలు సిసలైన ఆల్రౌండర్ గా కొనసాగుతూ బ్యాటింగ్లో బౌలింగ్లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా ఇటీవల గాయం కారణంగా టీమ్ ఇండియా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో కీలకమైన మ్యాచులకు దూరం అవ్వడమే కాదు ఇక సర్జరీ కావడం కారణంగా వైద్యులు ఆరు నెలల పాటు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్ లో జరగబోయే ప్రపంచ కప్ కి కూడా దూరం అయిపోయాడు.


 ఇక ఇలా రవీంద్ర జడేజా లాంటి కీలకమైన ఆటగాడు దూరం అవడం టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టులోకి మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ జడేజా లోటును భర్తీ చేస్తాడా లేదా అనే అనుమానం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో జడేజా లేని లోటును ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తప్పకుండా భర్తీ చేస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తాడు.


 టి20 ప్రపంచ కప్ లో టీమిండియాకు జడేజా లేని నోటు కనిపించదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవర్ ప్లే లో కూడా వికెట్లు తీయగల బౌలర్ టీమ్ ఇండియాకు దొరికాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ టు వికెట్ విసురుతున్నాడు. స్టంప్స్ ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో బ్యాట్స్మెన్ లకు ఎంతో కష్టంగా మారిపోతుంది. అంతేకాదు అతని లైన్ అండ్ లెంత్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. జడేజాకు అతడు మంచి రీప్లేస్మెంట్ అని నా అభిప్రాయం అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. మరి వసీం జఫర్ అభిప్రాయంపై మీరేమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: