ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా అటు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకొని ఇక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లలో హర్షల్ పటేల్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తనదైన బౌలింగ్ ప్రతిభతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కీలక బౌలర్గా ఎదిగాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ వేస్తూ ఒకవైపు పరుగులు కట్టడం చేయడమే కాదు మరోవైపు అటు వికెట్లు కూడా పడగొడుతూ టీమిండియా కు ఫ్యూచర్ స్టార్ అని అందరిలో కూడా నమ్మకాన్ని కలిగించాడు అని చెప్పాలి.


 ఇక ఇలా గత కొంతకాలం నుంచి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కొనసాగుతున్న హర్షల్ పటేల్ ఎందుకో మునుపటిలా మాత్రం అద్భుతమైన బంతులను సంధించలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. ఒకప్పుడు వైవిద్యమైన బంతులతో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టి వికెట్లు పడగొట్టిన హర్షల్ పటేల్ ఇక ఇప్పుడు బ్యాట్స్మెన్ లకు  సిక్సర్లు ఫోర్లు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇక ఇది కాస్త అటు టీమ్ ఇండియా విజయం పై ఎంతగానో ప్రభావం చూపుతుంది అని చెప్పడంలో అతి శయోక్తి లేదు.



 ఈ క్రమం లోనే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్గా పేరుందిన హర్షల్ పటేల్ చివర్లో ఎక్కువ పరుగులు ఇవ్వడం అటు టీమిండియాను ఎంతగానో కలవర పెడుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయం పై హర్షల్ పటేల్ కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొన్ని సూచనలు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ తక్కువ స్పీడ్ తో వేసే బంతులను సరైన ప్రాంతంలో సందించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. స్లో బంతులను పూర్తిస్థాయి పుల్లర్ గా వేయాలని అప్పుడు బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: