టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు  అటు అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవీంద్ర జడేజా ఆట తీరును భారత అభిమానులు మాత్రమే కాదు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.. ప్రేక్షకులందరూ క్రికెట్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి అనుకుంటారో.. అలాంటి క్రికెట్ ఆడి చూపిస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా. మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్  చేయడం ఇక బ్యాటింగ్లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ విధ్వంసం సృష్టించడం.. తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు పడగొట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు.


 ఇకపోతే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి కాయం కారణంగా టి20 వరల్డ్ కప్ ఆడలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిటిషన్ లో ఉన్నాడు జడేజా.  అయితే రాజ్ పుత్  కుటుంబానికి చెందిన రవీంద్ర జడేజా కు గుర్రపు స్వారి, కత్తి సాము అంటే ఎంతో ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు వీటిపై మంచి పట్టు కూడా ఉంది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఎంతో ఇష్టంగా గుర్రాలను కూడా పెంచుకుంటున్నాడు రవీంద్ర జడేజా. ఇప్పటివరకు ఎన్నోసార్లు గుర్రపు స్వారీ చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి తన క్రష్ ఎవరో చెప్పేసాడు. ఏకంగా తనకు ఇష్టమైన ఒక గుర్రంతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు రవీంద్ర జడేజా. అంతేకాదు ఈ పోస్ట్ కి మై క్రష్ అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేశాడు. అయితే ఇంతకుముందే తన గుర్రంపై స్వారీ చేసిన వీడియోతో పాటు మరికొన్ని ఫోటోలు కూడా జతపరిచి ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు రవీంద్ర జడేజా పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పోస్ట్ పై ఎంతో మంది అభిమానులు స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: