ఇటీవల కాలం లో మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో కూడా అర్థం కాని విధంగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంత సంతోషం గా సాగి పోతుంది అనుకుంటున్న తరుణం లో ఊహించని ఘటనలు ఏకంగా మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలం లో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది కానీ తగ్గడం లేదు. కొంత మంది రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం గా వాహనాల నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు.


 మరి కొంత మంది ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణం  గా ప్రాణాలకు కోల్పోతున్నారు. అదేంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా కారణం గా ప్రాణాలు కోల్పోవడం ఏంటి అనుకుంటున్నారు కదా.. ప్రభుత్వాలు రహదారులను సరిగ్గా పునర్నిర్మానం చేపట్టకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణిస్తూ చివరికి ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా రోడ్డు నిబంధనలు పాటించినప్పటికి చివరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే వాహనదారుల ప్రాణాల మీదికి తెస్తుంది అని చెప్పాలి.


 అయితే ఇక్కడ ఓ మహిళ గుంతల మయం గా ఉన్న రోడ్డు కారణంగా ప్రమాదం జరిగి తన భర్తను కోల్పోయింది. ఇక తన భర్తకు జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదు అనే ఉద్దేశం తో మహిళ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.  రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదు. దీంతో గుంతల మయమైనా రోడ్డు కారణంగా భర్తను కోల్పోయిన మహిళ గుంతలను మట్టితో పూడ్చేయడానికి  పూనుకుంది. కొన్ని రోజుల నుంచి రోడ్లపై ఉన్న గుంతలు అన్నింటినీ కూడా పూడ్చడం మొదలుపెట్టింది. బెంగుళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగమణి అనే మహిళ భర్త రోడ్డు ప్రమాదం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: