స్మృతి మందాన.. ఇక ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అటు ప్రపంచ క్రికెట్లో టీమ్ ఇండియా మహిళల జట్టు తరఫున ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆట తీరుతో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించడమే కాదు ఇక క్రికెట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మహిళా క్రికెట్ జట్టును ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో అటు స్మృతి మందాన పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న ఈమె.. బ్యాటింగ్ చేస్తుందంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోతూ ఉంటారు.


 ఇక స్మృతి మందాన ఆట తీరుకు మాత్రమే కాదు ఆమె అందం అభినయానికి కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇక ఆమె చిలిపి నవ్వుతోనే ఎంతోమంది యువకుల మనసులు కొల్లగొట్టింది. అయితే సాధారణంగా స్మృతి మందాన సహా మరి కొంతమంది మహిళా క్రికెటర్లు ఎప్పుడు టీమిండియా జెర్సీలో లేదంటే మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం మాత్రమే ఇప్పటివరకు చూసాము. కానీ ఎవరైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని కుందనపు బొమ్మల తయారైతే ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు.


 అలాంటిది తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మందానా లాంటి క్రికెటర్  ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపిస్తే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఇండియా మహిళా క్రికెటర్స్ స్మృతి మందాన ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ గా మారిపోవడంతో వావ్ సో బ్యూటిఫుల్ అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరోసారి ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి కుర్ర కారు మతి పోగొడుతుంది స్మృతి మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: