అయితే గత ఏడాది వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు బుమ్రా. ఇక అతను సర్జరీ చేసుకుని ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుమ్రా ఇక ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్లో అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది. అతన్ని జట్టులోకి కూడా ఎంపిక చేసింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని అందుకే ఇక అతన్ని సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.
దీంతో అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు. అయితే బుమ్రా గాయం గురించి ఇటీవలే కెప్టెన్ రోహిత్ స్పందించాడు. వన్డే సిరీస్ కు బుమ్రా దూరం కావడం దురదృష్టకరం.. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక వెన్నునొప్పి పూర్తిగా తగ్గిందని అటు మెడికల్ టీం కి కూడా సమాచారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు బుమ్రాకు మళ్లీ వెన్ను నొప్పి మొదలైంది అని తెలియజేసాడు. ఈ క్రమంలోనే బిసిసిఐ అతన్ని తప్పించింది. అతను భారత ప్రధాన బౌలర్ కాబట్టి.. బుమ్రా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని భావించాము. అందుకే వన్డే సిరీస్ నుంచి తప్పించామంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి