ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుతమైన ఆటగాళ్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా డేవిడ్ వార్నర్ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఓపెనర్క బరిలోకి దిగుతూ ఎప్పుడు మంచి ఆరంభాలు అందిస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఇక తన బ్యాటింగ్తో ఇప్పటివరకు ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు అటు ఐపీఎల్లో సైతం వార్నర్ అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు.


 ఏకంగా భారత జట్టు స్టార్ ప్లేయర్లకు సైతం సాధ్యం కాని రికార్డులు అటు విదేశీ ప్లేయర్ అయినా డేవిడ్ వార్నర్ పేరిట ఉన్నాయి అనడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల మరోసారి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు గెలుపు ఓటములు పక్కన పెడితే వార్నర్ ప్రదర్శన మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్ హిస్టరీలో 6000 పరుగులు సాధించిన మూడో ప్లేయర్గా మారిపోయాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా కూడా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.



 డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఐపీఎల్లో 6000 పరుగులను పూర్తి చేసుకున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇక సారధ్య బాధ్యతలను కూడా భుజాన  వేసుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం మంచి ప్రదర్శన చేశాడు. దీంతో 6000 పరుగుల మార్కును అధిగమించాడు అని చెప్పాలి. ఇక ఈ అరుదైన ఘనత సాధించడం పై డేవిడ్ వార్నర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl