టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అందరిలాగనే ఒక సాదాసీదా ఆటగాడిగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. తక్కువ సమయంలోనే తాను వచ్చిపోయే ఆటగాడిని కాదు.. చరిత్ర సృష్టించే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆటతీరుతో నిరూపించాడు. టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా ఎదగడమే కాదు అటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అత్యుత్తమ క్రికెటర్ గా హవా నడిపించాడు అని చెప్పాలి. ఎంతోమంది లెజెండరీ  క్రికెటర్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించాడు.



 ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో రికార్డుల కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక మైదానంలో ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే చాలు ఇక ఎంతో అగ్రసీవ్ గా కనిపిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఉంటాడు. అయితే మైదానం బయట అంతే సరదాగా ఉంటూ ఇక అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు అని చెప్పాలి.అయితే విరాట్ కోహ్లీ అటు క్రికెట్ ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా మరియు వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంత అన్న విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.



 కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ దాదాపు ఒకవేయి50 కోట్ల రూపాయలు అని స్టాక్ గ్రో అనే సంస్థ తెలిపింది. ఐపీఎల్ ద్వారా కోహ్లీ ప్రతియేట 15 కోట్లు సంపాదిస్తాడు. ఇక బీసీసీఐ ద్వారా 7 కోట్ల రూపాయలు అందుతాయి. 18 బ్రాండ్లకు  సంబంధించిన వాణిజ్య  ప్రకటనల్లో నటించటం ద్వారా 175 కోట్లు వస్తాయ్. ఇక ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి 8.9 కోట్లు.. కోహ్లీ తీసుకుంటున్నాడు. ఇక ముంబైలో 34 కోట్లు, గురు గ్రామ్ లో 80 కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: