ఇలాంటి విన్యాసాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని విన్యాసాలు చూసిన తర్వాత వరల్డ్ రికార్డు ఏమో ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చేసిన ప్రమాదకరమైన విన్యాసం అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ఏకంగా తనను తానుకు నిప్పంటించుకుని ప్రపంచ రికార్డును సృష్టించాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఫ్రాన్స్ దేశానికి చెందిన 39 ఏళ్ల అగ్నిమాపక దళ సభ్యుడు జోనాథన్ రెండు ప్రపంచ రికార్డులను సృష్టించాడు.
ఏకంగా శరీరానికి మొత్తం నిప్పంటించుకుని 272.25 మీటర్లు పరిగెత్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును ఎక్కించుకున్నాడు సదరు వ్యక్తి. గతంలో 204.23 మీటర్లుగా ఉన్న ఈ రికార్డును ఇటీవలే జొనాథన్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. కేవలం ఒక రక్షణ సూట్ ధరించి.. ఎలాంటి ఆక్సిజన్ కూడా లేకుండా అతను ఇలా నిప్పంటించుకొని పరిగెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఈ క్రమంలోనే జోనాథన్ మరో రికార్డును కూడా సృష్టించాడు అని చెప్పాలి. ఒంటికి నిప్పంటించుకుని అత్యంత వేగంగా 100 మీటర్ల స్ప్రింట్ పూర్తి చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో మరో రికార్డు సృష్టించాడు. కేవలం 17 సెకండ్స్ లోనే 100 మీటర్ల పరుగును పూర్తి చేశాడు. గతంలో బ్రిటన్ కు చెందిన అంటోని బ్రిటన్ 24.58 సెకండ్ల పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు జోనాథన్ రాశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి