అయితే ఈ ఫైనల్ కు చేరుకునే క్రమంలో అటు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది టీమిండియా దీంతో టీమ్ ఇండియాకు తిరుగులేదని అందరూ అనుకున్నారు కానీ ఊహించని రీతిలో ఫైనల్ లో అదే పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. ఇక పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం మాత్రం భారత అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. టీమిండియా జాతీయ జట్టు మాత్రమే కాదు ఇక ఇండియా ఏ జట్టు సైతం అదే రీతిలో ఫైనల్ పోబియా ప్రస్తానాన్ని కొనసాగిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎందుకంటే టీమిండియా జాతీయ జట్టు సైతం గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టోర్నీలలో మొదట్లో మెరుపులు మెరూపించి.. ఇక ఫైనల్ లేదా సెమీఫైనల్ లో చేతులెత్తేయడం కనీస పోటీ ఇవ్వలేక ఇక టోర్నీ నుంచి నిష్క్రమించడం లేదా రన్నరప్ తోనే సరిపెట్టుకోవడం చేస్తుంది. అయితే అటు ఎమర్జింగ్ ఆసియా కప్ లో కూడా కుర్రాళ్ళు ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ నే కొనసాగించారు. ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 120 పరుగుల తేడాతో భారత్ ఓటమీ చవిచూసింది. 3503 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ అభిషేక్ శర్మ 61, సుదర్శన్ 29 మంచి ఓపెనింగ్ అందించారు. కెప్టెన్ దుల్ 39 పర్వాలేదనిపించాడు కానీ మిగతా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో 128 పరుగుల తేడాతో ఓడిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి