ప్రస్తుతం భారత క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్నారు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలను అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అని చర్చ వచ్చినప్పుడల్లా ఇటీవల కాలంలో ఒకే ఒక పేరు బలంగా వినిపిస్తుంది. ఆ పేరు ఏంటో కాదు హార్దిక్ పాండ్యా. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడో.. అప్పటినుంచి ఇక అతనే ఫ్యూచర్ కెప్టెన్ అంటూ అందరూ నమ్మడం మొదలు పెట్టారు.  ఇందుకు తగ్గట్లుగానే అటు బీసీసీఐ కూడా నిర్ణయాలు తీసుకుంది.


 ఏకంగా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఇక టీమిండియా ఆడిన అన్ని టి20 మ్యాచ్ లకు కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. అతనే రెగ్యులర్ కెప్టెన్ అని ప్రకటించకపోయిన బిసిసిఐ వరుసగా అతనికి సారధ్యమందిస్తున్న తీరు చూసి అందరూ ఇది ఫిక్స్ అయిపోయారు. రోహిత్ తర్వాత మూడు ఫార్మాట్ల సారధ్య బాధితులను భుజాన వేసుకోబోయేది హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టి20 ఫార్మాట్కు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది.



 ఈనెల 30వ తేదీ నుంచి భారత్ ఆసియా కప్ ఆడబోతుంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలలో ఇక ఈ టోర్నీ జరగబోతుంది  అయితే ఇక ఆసియా కప్ 2023లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా రోహిత్ కు డిప్యూటీగా పేసర్ బుమ్రాను నియమిస్తారని తెలుస్తుంది  ప్రస్తుతం వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా పై వేటు వేయబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారికంగా బీసీసీఐ ధ్రువీకరించబోతుందట. అయితే కెప్టెన్సీ పరంగా చూస్తే హార్దిక్ కంటే బుమ్రా ముందు వరుసలో ఉన్నాడని.. 2022లో టెస్ట్ టీంకు సారధిగా కూడా వ్యవహరించాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: