ఇటీవలే ఇస్రో  సాధించిన విజయానికి అటు 153 కోట్ల భారత ప్రజానికం  మొత్తం తలెత్తుకుంది అన్న విషయం తెలిసిందే. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయం సాధించింది. ఏకంగా చంద్రుడిపై అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే రష్యా, అమెరికా, చైనా తర్వాత ఇక చంద్రుడిపై అడుగు పెట్టిన 4వ దేశంగా చరిత్ర సృష్టించింది ఇండియా. అదే సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొదటి దేశంగా కూడా రికార్డు సృష్టించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ప్రజానీకం మొత్తం చంద్రయాన్ - 3 విజయం పై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఎంతోమంది వాట్సాప్  స్టేటస్ లు పెట్టి చంద్రయాన్ - 3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ విజయాన్ని ఎంతో గర్వకారణం అంటూ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ సాధించిన విజయం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే చంద్రయాన్ - 3 అద్భుత విజయం గురించి భారత మాజీ క్రికెటర్ వసీం  జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. జాబిల్లి ఉపరితలాన్ని క్రికెట్ పిచ్ గా అభివర్ణించిన జాఫర్.. ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక సీమర్, ముగ్గురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగుతా అంటూ వసీం జాఫర్ పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా చంద్రయాన్ - 3 విజయం పై స్పందించిన మరో మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ప్రయోగం పై విమర్శలు చేసిన వారికి ఇక ఈ విజయంతో నిద్రలేని రాత్రులు మిగులుతాయి అంటూ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: