బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండుగ మొదలవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగే ప్రతి మ్యాచ్ ను కూడా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రపంచ స్థాయి క్రికెటర్లు అందరూ కూడా అటు ఐపీఎల్లో సహచరులుగా మారిపోయి ఒక జట్టు విజయం కోసం పోరాడుతుంటే చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవు.

 అయితే 2023 ఐపీఎల్ సీజన్ ఎంతో విజయవంతంగా ముగిసింది. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు  కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయ్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఐపిఎల్ లో టైటిల్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాయ్. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన కొంతమంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో ఇక కొన్ని టీమ్స్ అయితే కోచింగ్ సిబ్బందిని కూడా మార్చుతూ ఉన్నాయి. మరికొన్ని టీమ్స్ ఏకంగా కెప్టెన్ గా కొత్తవారిని నియమించుకొని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి.


 అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మినీ వేలం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ వేలం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా డిసెంబర్ 19వ తేదీన దుబాయిలో మినీ వేలం జరగబోతుంది. ఒక్కో టీం పర్స్ మనీ  దాదాపు 100 కోట్ల వరకు ఉంది. నవంబర్ 15 వరకు రిటైన్ చేసుకున్న, వదిలేసిన ఆటగాళ్ల  జాబితాను అన్ని ఫ్రాంచైజీలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. కాగా మెనీ మెనీ వేలంలో ప్యాట్ కమిన్స్, హేల్స్, బిల్లింగ్స్, మార్ష్ లాంటి వారు వేలంలో పాల్గొనబోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl