ప్రస్తుతం ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ జరుగుతుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ వరల్డ్ కప్ టోర్నీ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది. అంతేకాదు ఎన్నో చారిత్రాత్మక విజయాలకు ఈ మెగా టోర్నీ వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ప్రేక్షకుల అంచనాలను కూడా కొన్ని విషయాలలో తారుమారు చేసింది ఈ వరల్డ్ కప్. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్లు చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా ఇక వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన చిన్న టీమ్స్ మాత్రం చారిత్రాత్మక విషయాలు సాధించాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖాడే స్టేడియంలో నేడు జరగబోయే మ్యాచ్ లో వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టుతో పాటు న్యూజిలాండ్ జట్లు తలబడుతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. వరల్డ్ కప్ లో మ్యాచ్ జరగడానికి ముందు.. ఇక ఆ మ్యాచ్ లో తలబడుతున్న రెండు టీమ్స్ కి సంబంధించిన జాతీయ జెండాలను మైదానంలో ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం.


 అయితే ఇది ప్రతి మ్యాచ్ లో జరిగే విషయమే కదా అని ఇది చూసి అందరూ లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇలా మైదానంలో ప్రదర్శించే జెండాల వెనక ఒక ఆసక్తికర స్టోరీ ఉందట. వరల్డ్ కప్ లో ప్రదర్శిస్తున్న జెండాలకు ఒక ప్రత్యేకత ఉంది అన్నది తెలుస్తుంది. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ చేసి ఆ జెండాలను తయారు చేశారట. కోకోకోలా ఇండియా, ఐసీసీ కలిసి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిందట. ప్రతి జాతీయ జెండా తయారీకి 11,000 బాటిల్స్, ఐసీసీ జెండా తయారీకి రెండువేల బాటిల్స్ అవసరం అవుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc