ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ఆస్ట్రేలియా. ఇక ఎప్పుడూ అన్ని ఫార్మాట్లలో పటిష్టమైన జట్టుగా ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే చాలు మిగతా టీమ్స్ అన్ని కూడా కాస్త భయపడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా అంతలా ప్రత్యర్థి పై పూర్తి ఆదిపత్యం చాలా ఇస్తూ ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు ఎందుకు ఛాంపియన్ టీం అయింది అన్న విషయం ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మరోసారి నిరూపితం అయింది అన్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు వరకు వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధికంగా 8సార్లు ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా జట్టు.. ఏకంగా ఆరుసార్లు వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. దీన్నిబట్టి ఇక ప్రపంచ క్రికెట్లో ఈ జట్టు ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కాస్త పడుతూ లేస్తూనే ప్రయాణాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది. అయితే అప్పుడు వరకు వరుస విజయాలు సాధించి ఫైనల్ కు దూసుకొచ్చిన టీమిండియాను సొంత గడ్డ మీదనే ఓడించి ఆరోసారి ఛాంపియన్గా అవతరించింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆట తీరు చూసి ఆ జట్టు వరల్డ్ కప్ గెలవడానికి సరైన అర్హత కలిగిన టీం అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టైటిల్ గెలవగా.. ఆ జట్టు కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ పెట్టిన ఒక ఓల్డ్ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంటర్నేషనల్ షెడ్యూల్లో వచ్చే 12నెలల పాటు టెస్టులు, వన్డేలు ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వరల్డ్ కప్ ముందు విశ్రాంతి తీసుకుంటా. కాబట్టి ఐపీఎల్ ను వదులుకుంటా అంటూ  ఫ్యాట్ కమిన్స్ గత ఏడాది పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇలా ఐపీఎల్ ను వదులుకొని బిగ్ టోర్నమెంట్ కోసం రెడీ అయి ఇక రెండు టైటిల్స్ గెలిచారు అంటూ ఎంతోమంది అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: