అయితే గత కొంతకాలం నుంచి వన్డే ఫార్మాట్ పై బాగా ఫోకస్ చేసిన రోహిత్ శర్మ.. టి20 లకు దూరంగానే ఉంటున్నాడు. దీంతో ఇక అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా హార్దిక్ చేతికి బాధ్యతలు అప్పగించి యంగ్ ప్లేయర్స్ తో టి20 సిరీస్ లు ఆడిస్తుంది బీసీసీఐ. అయితే ఇప్పుడు టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ ఇక రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ ఆడతాడా లేదా అన్నదానిపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే ఇక ఎవరు కెప్టెన్గా t20 వరల్డ్ కప్ లో టీమిండియా బరిలోకి దిగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.
అయితే ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరించాలి అంటూ సూచించాడు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం టి20 లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నప్పటికీ రోహిత్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ కెప్టెన్గా జట్టులోకి వస్తే కోహ్లీ కూడా వస్తాడని దీంతో టీమ్ ఇండియా మరింత పటిష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి