అయితే ఇక బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహా లోనే అటు కబడ్డీ ఆటను ప్రేక్షకులందరికీ మరింత దగ్గర చేసేందుకు.. ఇక ఈ ఆటకు మరింత గుర్తింపును తెచ్చి పెట్టేందుకు ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. ఇక ఊహించని రీతిలో.. ఈ లీగ్ కి స్పందన వచ్చింది. దీంతో ఇక ప్రతి ఏడాదికి కూడా ప్రో కబడ్డీ లీగ్ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది అనే విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతుంది. దీంతో ప్రేక్షకులందరిలో ఈ లీగ్ పై మరింత ఆసక్తిని పెంచేందుకు ఎంతో మంది సెలబ్రిటీలతో ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల కబడ్డీ ప్రమోషన్స్ లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కబడ్డీ ఆడటం కంటే ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడం.. ఎంతో సులభం అంటూ చెప్పుకొచ్చాడు. కబడ్డీ ఆడాలంటే దమ్ము ఉండాలని.. ఎంతో ఫిట్గా ఉంటే తప్ప ఆడలేరు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాను చిన్నప్పుడు ముంబై వీధిలో కబడ్డీ ఆడేవాడిని అంటూ గుర్తు చేసుకున్నాడు. డిసెంబర్ రెండవ తేదీ నుంచి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతుండగా.. ఇటీవల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి