ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్న రోహిత్ శర్మకు ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఊహించిన షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఐపీఎల్ లో ఉన్న అన్ని ఫ్రాంచైజీలు  కూడా రోహిత్ లాంటి కెప్టెన్ మాకు కావాలి అని కోరుకుంటు ఉంటె.. అటు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మని మాత్రం ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా ప్రకటిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.



 అయితే రోహిత్ లాంటి కెప్టెన్ ను ఇలా సారధ్య బాధితుల నుంచి తప్పించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు. ముంబై ఇండియన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించలేదు అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన నేపథ్యంలో.. ఒకవేళ రోహిత్ అసంతృప్తితో వేలంలోకి వచ్చాడు అంటే చాలు అతని దక్కించుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూఉన్నాయి. అయితే ముంబై కెప్టెన్సి కోల్పోయిన రోహిత్ మరో టీంలోకి వెళ్లి సారధిగా బాధ్యతలు చేపడితే బాగుంటుంది అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.



 అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇక మరో ఛాంపియన్ టీమైన చెన్నై సూపర్ కింగ్స్ లోకి వస్తే బాగుంటుంది అని ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ బద్రీనాథ్ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకవేళ రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడితే ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే అతని పోస్ట్ వైరల్  మారడంతో ఇక ఎంతోమంది నేటిజన్స్ కూడా స్పందిస్తున్నారు. ధోని తర్వాత రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపడితే బాగుంటుందని.. అతను చెన్నై జట్టులోకి రావాలి అంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: