జట్టుకు కావాల్సిన ఆటగాళ్ళను ఆర్సిబి వేలంలో సెలెక్ట్ చేసుకోలేకపోయింది అంటూ విమర్శలు చేస్తున్నారు. టీం బలహీనతలపై ఇక జట్టు యాజమాన్యం ఫోకస్ పెట్టలేక పోయినట్టు విమర్శిస్తున్నారు. వేలంలో ఎలిమెంటరీ తప్పిదాలు చేసింది అంటూ మండిపడుతూ ఉండడం గమనార్హం. అయితే కామరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ నుంచి 17.5 కోట్లు పెట్టి ఆర్సిబి దక్కించుకుంది. ఇక అతని కోసమే ఎక్కువ డబ్బులు వెచ్చించింది. దీంతో ఇక వేలంలో కావలసిన ఆటగాళ్ళ కోసం పోటీ పడలేకపోయింది. ఇక ప్యాట్ కమిన్స్ కోసం 20. 25 కోట్ల వరకు బిడ్ వేసిన ఆర్ సి బి. ఇక సన్రైజర్స్ 20.5 0 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గింది. జోస్ హేజిల్ వుడ్, హాసరంగా, హర్షల్ పటేల్ డేవిడ్ వీళ్ళే, మైకేల్ బ్రేస్ వెల్, లాంటి ఆటగాళ్ళను కూడా తక్కువ పర్స్ మనీ కారణంగా వదులుకుంది గతిలేక అల్జారి జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, పెర్గ్యూసన్, సప్నల్ సింగ్, సౌరబ్ చాహన్ లాంటి ఆటగాళ్ళను తీసుకుంది.
అయితే ఇదే విషయంపై కర్ణాటకకు చెందిన క్రికెటర్ దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శలు గుర్తించాడు. జట్టు పర్సులోని సగం డబ్బులను ఆర్సిబి అభిమన్యులకు ఇచ్చి వేలంలో వారికి కాస్త స్వేచ్ఛను ఇస్తే అభిమానులు ఆక్షన్ టీం కంటే అత్యుత్తమమైన జట్టును ఎంపిక చేసేవారు డబ్బులను కూడా ఆదా చేసేవారు అంటూ దొడ్డ గణేష్ చెప్పుకొచ్చాడు ప్రొఫెషనల్ క్రికెట్ టీం ఇలాంటి ఎలిమెంటరీ తప్పిదాలు చేయటాన్ని అసలు నమ్మలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు.
ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్ల లిస్ట్ చూసుకుంటే :
అల్జారీ జోసెఫ్- రూ. 11.50 కోట్లు
యశ్ దయాల్-రూ. 5 కోట్లు
టామ్ కరణ్- రూ. 1.5 కోట్లు
లాకీ ఫెర్గూసన్- రూ. 2 కోట్లు
సప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు
సౌరవ్ చౌహన్- రూ. 20 లక్షలు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి