బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది ఐపీఎల్. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఆడాలని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆశపడుతూ ఉంటాడు. స్టార్ ప్లేయర్స్ దగ్గర నుంచి కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలనుకునే యువ ఆటగాళ్ళ వరకు అందరికి ఐపీఎల్ ఆడాలనేది ఒక కలగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి.



 మరీ ముఖ్యంగా ఇక అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అనుకునే యువ ఆటగాళ్లకి ఐపీఎల్ అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. అయితే ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త ప్లేయర్లు ఐపీఎల్ లోకి వస్తూ ఉంటారు. ఐపీఎల్ లో బాగా రానించి ఇక జాతీయ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఐపీఎల్లో ఆడిన డెబ్యూ మ్యాచ్ లో కొంతమంది ప్లేయర్లు తడబాటుకు గురవ్వడం.. చూస్తూ ఉంటాం. కానీ ఇంకొంతమంది మాత్రం అదరగొడుతూ ఉంటారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాట్స్మెన్ సమీర్ రిజ్వి ఇటీవల ipl లోకి అరంగేట్రం చేసాడు. తన డెబ్యూ మ్యాచ్ లోనే అరుదైన రికార్డుసృష్టించాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు.


 ఈ క్రమంలోనే  ఐపిఎల్ హిస్టరీలో ఇప్పటివరకు తొలి మ్యాచ్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన ఆటగాళ్ళు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు 9 మంది క్రికెటర్లు మాత్రమే ఇలా డెబ్యూ మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు. ఇటీవల చెన్నై బ్యాటర్ సైతం ఇలాగే సిక్స్ కొట్టి వీరి సరసన నిలిచాడు. ఇంతకుముందు రాబిన్ కిన్వి (ఆర్ ఆర్), కెఒన్ కూపర్ (ఆర్ ఆర్} రసేల్ (కేకేఆర్) కార్లోస్ బ్రాత్ వైట్ (DD), అనికేత్ చౌదరి (ఆర్ సి బి), జీవస్ సీర్లేస్ (కేకేఆర్), మహిష్ తీక్షన (csk) సిద్ధిష్ లాడ్ (ఎమ్ఐ) తరఫున ఆడిన తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్సర్ కొట్టి రికార్డు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl