మార్చ్ 22వ తేదీన ఇండియాలో ప్రారంభమైన క్రికెట్ పండుగ.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూనే ఉంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అంటూ ఉత్కంఠ భరితంగా సాగుతూ అసలు సిసలైన క్రికెట్ మజాని ప్రేక్షకులకు అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ అంచనాలకు మించి రాణిస్తుంటే మరికొన్ని టీమ్స్ మాత్రం ఇక పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాయ్. కాగా ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచి కూడా అందరి కన్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన ఉంది  ఎందుకంటే అటు రిషబ్ పంత్ దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్ కు దూరంగా ఉండి ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇచ్చాడు.


 ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలోకి దిగింది. దీంతో ఈసారి ప్రస్థానం ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఊహించని రీతిలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో విధ్వంసకర ఓపెనర్ గా పేరు సంపాదించుకున్న పృద్వి షా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో తుదిజట్టులో కనిపించకపోవడం గమనార్హం. అతన్ని బెంచ్ కి పరిమితం చేశారు. అయితే పృద్విషా లాంటి ఆటగాడిని బెంచ్ కి పరిమితం చేయడం ఏంటీ అని అందరూ షాక్ అయ్యారు.



 ఇక ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఢిల్లీ జట్టులో విధ్వంసకర ఓపెనర్ గా కొనసాగుతున్న పృథ్విషాను డగౌట్ లో కూర్చోబెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించాడు. పృథ్వి షా ఒక అద్భుతమైన ఆటగాడు. ఒక డేంజరస్ క్రికెటర్. గత సీజన్లో అతను అతను పెద్దగా రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రానికి అతని డగౌట్ లో కూర్చోబెడతారా.. అతను డగ్ అవుట్ నుంచి పరుగులు చేయలేడు కదా అంటూ టామ్ మూడి ప్రశ్నించాడు. కాగా పృథ్విషా స్థానంలో తెలుగు కురాడు రికీ భుయ్ కి అవకాశం కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl