ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన క్రికెట్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల పాటు ప్రపంచం లోనే నెంబర్ 1 బ్యాటర్ గా కెరియర్ ను కొనసాగించాడు. అలాగే ఎన్నో సంవత్సరాల పాటు ఇండియన్ టీం కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇకపోతే ఈయన ఎంత గొప్ప ఆట తీరును ప్రదర్శిస్తున్నప్పటికీ కొన్ని సార్లు మాత్రం ఈయనకు విమర్శలు తప్పడం లేదు.

తాజాగా కూడా కోహ్లీ ఆట తీరును కొంత మంది విమర్శిస్తూ ఉంటే ఆయన అభిమానులు మాత్రం దానిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఏం జరిగింది అనే విషయాలని తెలుసు కుందాం. నిన్న "ఐ పీ ఎల్ 2024" లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ... కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ముగిసే సరికి 182 పరుగులు చేసింది.

ఇందులో దాదాపు పది ఓవర్ల బంతులను ఆడిన కోహ్లీ 83 పరుగులు చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఇవి గొప్ప పరుగులే అయినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి "కే కే ఆర్" టీం 16.5 ఓవర్లు ముగిసే సరికి కేవలం మూడు వికెట్ లను కోల్పోయి 186 పరుగులను చేసి బెంగళూరు పై భారీ విజయాన్ని అందుకుంది. ఇక పూర్తి ఇన్నింగ్స్ అయిన తర్వాత కొంత మంది దాదాపు పది ఓవర్ల బంతులను ఆడిన కోహ్లీ 83 పరుగులు చేయడం అనేది ఆశించదగిన విషయం కాదు.

అతను ఇంకా స్పీడ్ గా ఆడి ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవి. అప్పుడు "కే కే ఆర్" టీం కి విజయం దక్కేది కాదు అని కోహ్లీ ఆట తీరును విమర్శిస్తున్నారు. ఇకపోతే మరి కొంత మంది మాత్రం కోహ్లీ కి ఇతర ఆటగాళ్ల నుండి సరైన సపోర్ట్ దక్కలేదు. అందుకే ఆయన స్లో గా పరుగులను చేశాడు అని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: