నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ... గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఇందులో ఈ టీం కెప్టెన్ అయినటువంటి సంజు సాంసంగ్ 38 బంతుల్లోనే 68 పరుగులు చేసి అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడాడు.

ఇక ఆర్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. వీళ్లిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్ తో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు ను చేసింది. ఇక ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో  ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ వల్ల ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి సంజు కు ఏకంగా 12 లక్షల ఫైన్ పడింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐ పీ ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈయనకు 12 లక్షల ఫైన్ ను వేధించింది. నిన్నటి మ్యాచ్ లో నిర్ణత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఈయనకు ఈ ఫైన్ పాడింది. మరో సారి కనుక ఇదే తప్పు జరిగితే భారీ మొత్తంలో ఫైన్ కూడా ఐపీఎల్ ఈ ఆటగాడికి విధించే ఛాన్స్ ఉంది.

గతంలో ఇలాంటి తప్పే చేసినందుకు ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ కి కూడా "ఐ పీ ఎల్" యాజమాన్యం 24 లక్షల ఫైన్ ను బెదిరించింది. ఇక సంజుకు భారీ మొత్తంలో ఫైన్ వేధించినప్పటికీ ఈయన ఆట తీరుపై ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: