టీమిండియా స్టార్ క్లియర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపిఎల్ లో అదరగొడుతున్నాడు. ఒకవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరుస్తున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కూడా విఫలమైన అతను మాత్రం ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఆరు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు.



 అయితే కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ అతని స్ట్రైక్ రేట్ పై మాత్రం ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు  టి20 ఫార్మాట్ కు తగిన స్ట్రైక్ రేట్ తో కోహ్లీ బ్యాటింగ్ చేయడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు. కొంతమంది విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు తప్పకుండా టి20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయంపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ప్రస్తుత ఆర్సిబి ప్లేయర్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ కోసం భారత్ సెలెక్టర్లు ఎంపిక చేయకూడదని అభిప్రాయపడ్డాడు మాక్స్వెల్.


 నా జీవితంలో ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ. విరాట్ చాలా డేంజరస్ ఆటగాడు. 2016 t20 ప్రపంచ కప్ లో మొహాలీలో మాపై అతడు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇక ఆ ఇన్నింగ్స్ కోహ్లీ కెరియర్ లో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలి అనే విషయంపై కోహ్లీ ఎప్పుడు ఫుల్ క్లారిటీతో ఉంటాడు  టి20 వరల్డ్ కప్ లో కోహ్లీని భారత సెలక్టర్లు ఎంపిక చేయకూడదని ఆశిస్తున్నాను. ఎందుకంటే అతడు లేకపోతే మా జట్టుకు చాలా ప్రయోజనం ఉంటుంది అంటూ ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: