మోటరోలా కంపెనీ 5జీ వేరియంట్లో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే చాలా మోడళ్లను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసిన ఆ కంపెనీ తాజాగా మరో అత్యద్భుతమైన ఫోన్ ను కూడా లాంచ్ చెయ్యడం జరిగింది.మోటోరోలా ఎడ్జ్ 40 పేరుతో వచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్, ఈ-సిమ్ సపోర్టు, వైర్ లెస్ చార్జింగ్ ఇంకా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే పీ ఓఎల్ఈడీ డిస్‍ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ ఫోన్ కేవలం 7.58 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్‍తో వచ్చింది.అలాగే ఈ ఫోన్ బరువు కూడా 171 గ్రాములే ఉంటుంది. ఇంకా రసెడా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్‍ను కూడా కలిగి ఉన్నాయి. లునార్ బ్లూ కలర్ వేరియంట్ అక్రిలిక్ ప్యానెల్‍తో ఈ మొబైల్ వచ్చింది.ఇంకా 6.55 ఇంచుల కర్వ్డ్ ఫుల్ హెచ్‍డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 144Hz దాకా రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఇంకా హెచ్‍డీఆర్10+ ప్లస్ సపోర్ట్ ఉంటాయి.


గేమింగ్ అలాగే స్క్రోలింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, వినియోగదారులు తమ పరికరాన్ని సజావుగా నావిగేట్ చేయడానికి స్పీడ్ ఫ్లూయిడ్ 144Hz రిఫ్రెష్ రేట్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం డాల్బీ ఆట్మోస్ ఆడియో కూడా ఉంటుంది.ఇక ఈ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్‍గా ఇది నిలిచింది.అలాగే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍‍తో ఇది పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక రెండు కెమెరాల సెటప్ అనేది ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ మాక్రో కెమెరాగా కూడా ఉయోగపడుతుంది.  ఈ ఫోన్‍కు ఏకంగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.దీనికి 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇంకా 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.అలాగే 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: