ఈవారం అందరికంటే అభిజిత్ హౌస్ లో ఎక్కువ మన్ననలు పొందాడు. స్వయంగా అక్కినేని నాగార్జునే మహా నాయకుడు మెడల్ అభిజిత్ కు ఇచ్చాడు. ఈ వారం జరిగిన మనుషుల మరియు రోబోల మధ్య టాస్క్ లో... మనుషులు ఓడి రోబోలు గెలిచారు. రోబో టీమ్ కు చెందిన అభిజిత్ ముందుండి ఎంతో సమర్థవంతంగా తన టీమ్ ను నడిపించారని మెచ్చుకున్నాడు నాగ్.