మెగాస్టార్ చిరంజీవే స్వయంగా తనకు సర్జరీ జరిగిందని తెలుపుతూ తనకు సర్జరీ చేసిన డాక్టర్ తో కలిసి ఒక ఫోటోని చేశారు. అయితే ఈ ఫోటో షేర్ చేసి.. చాలామంది తన చేతికి ఉన్న బ్యాగును గమనించిన అభిమానులు, శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆరాతిస్తున్నారని తెలిసింది. చిన్నపాటి సర్జరీ మాత్రమే జరిగింది.. భుజం కిహోల్ సర్జరీ అంటూ తెలిపారు. ప్రస్తుతం తనకి ఆరోగ్యం బాగానే ఉందని ఇప్పటికే తన రెగ్యులర్ వర్క్స్ కూడా మొదలు పెట్టానని, తన సర్జరీ అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్ లో ఒకరైన డాక్టర్ నితిన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.. ఆయన నైపుణ్యంతోనే తనకు ఈ సర్జరీ చాలా సజావుగా జరిగింది, సౌకర్యంగా జరిగిందని తెలిపారు.
అభిమానుల ఆందోళన, ప్రేమాభిమానాలకు , ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం జాగ్రత్త అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ అనిల్ రావు పూడి తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాకి తెరకెక్కించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విశ్వంభర తో పాటు,డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి