అభిజిత్ ఈ పేరు సినిమాలలో పెద్దగా వినపడలేదు..కానీ ఏమని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రచ్చ చేశాడు. ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట.  బిగ్ బాస్ కి విజేతగా నిలిచి అందరూ  ఇప్పుడు అతనే పేరే పిలుస్తున్నారు.. బిగ్ బాస్ విన్నర్స్ జాతకాలు పూర్తి గా మారిపోతాయి.అని ఇతన్ని చూసి చెప్పొచ్చు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ హీరో విన్నర్ గా నిలుస్తాడాని ఎవరు ఉహీంచలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అతని పేరు వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా అభిజిత్ ట్రావెల్ డైరీస్ అంటూ ఒక వీడియో రెడీ చేస్తున్నాడు..


బిగ్ బాస్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నాయి.  మరి కొద్ది రోజుల్లో హీరోగా బిజీ అయ్యేలా మారిపోయాడు. ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. కానీ తొందరపడకుండా అభిజిత్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ సినీ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. కానీ అభిజిత్ కు దక్కిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే అతని స్థాయి మరో రేంజ్ కు వెళుతుంది.


అభిజీత్ ఫారెస్ట్ ను చుట్టేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ కోసం స్పెషల్ గా ఒక సెటప్ రెడీ చేసుకొని వెళ్లినట్లు చిన్న వీడియోలో చెప్పాడు. స్పెషల్ గా బైక్ వేసుకొని చేతిలో కెమెరా పట్టుకొని టైగర్స్ ఫొటోలను తీయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక అడవిలో తిరిగే టైగర్స్ ను ఫొటోలు తీస్తుంటే కొంతమంది ఫ్యాన్స్ అభిజిత్ తో ఫొటోలు కూడా దిగారట. ఇకోపోతే అభి ఇప్పుడు కొత్త జోష్ తో దూసుకు పోతున్నాడు. ఆ ఫుల్ వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేయనున్నట్లు ఈ బిగ్ బాస్ విన్నర్ వివరణ ఇచ్చాడు. మొత్తానికి కుర్రాడు బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: