నటి రజిత మన అందరికి సుపరిచితురాలే. ఆ పేరుకి పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించింది రజిత. ఇక రజిత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 35 ఏళ్ళు దాటింది.1987లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపుత్రుడు ఆమె మొదటి సినిమా.1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది. తమిళం, కన్నడ సినిమాల్లో కథానాయికగా కూడా నటించింది. రజిత హీరోయిన్ గా సైతం ఒడియా భాషలో నటించింది. ఆ భాషలో అక్కడ ఆమెకు అప్పట్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. అలాగే సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది వస్తుంది రజిత.



 తాజాగా ఈ టీవిలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో ఇటీవల రజిత పాల్గొన్నారు. ఆ షోలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను అందరితో పంచుకున్నది.

ఒకానొక సందర్భంలో రజిత రైలు ప్రయాణం చేసే సమయంలో జరిగిన సంఘటనలను అలీతో సరదాగా షోలో పంచుకున్నది. ఆ వివరాల్లోకి వెళితే అప్పట్లో సినిమాల మీద ఉన్న ఆసక్తితో రజిత చెన్నై వెళ్ళింది. ప్రముఖ నటీమణులు కృష్ణవేణి, రాగిణి ఆమెకు పినతల్లులు అవుతారు. మొదట సినిమాల్లో నటించే ఆసక్తి లేదని రజిత చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు చెప్పడంతో నటించడానికి ఒప్పుకుని కొన్ని సినిమాల్లో నటించింది.అక్కడ చదువుకుంటూనే సినిమాల్లో నటించింది. ఇక వయసు మళ్ళిన తర్వాత హీరోయిన్ పాత్రలు తగ్గిపోవడంతో ఆమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి పోయింది.



 అలీతో సరదాగా షో లో తనకు ట్రైన్ ఫోబియా ఉందనే విషయాన్నీ  చెప్పుకొచ్చింది.ఆ ఫోబియా ఏర్పడడానికి కారణం ఇద్దరూ టిటిఈలు అని కూడా తెలిపింది.  

రజిత మొదటిసారి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఫస్ట్ క్లాస్ ఏసీ భోగీలో టిటిఈ తనను అనుకోకుండా బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడని, అప్పుడు బెదిరి పోయి అరిచినా ట్రైన్ లో ఎవరికీ వినపడలేదు అని చెప్పుకొచ్చింది.ఇక మరోసారి చెన్నై వెళుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు తనతో కూర్చుని కబుర్లు చెబితేనే టికెట్ ఇస్తానని టిటిఈ పట్టుబట్టాడని, తనకు ఉదయమే షూటింగ్ ఉందని చెప్పినా వినకుండా రాత్రంతా కబుర్లు చెబుతూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. ఇలా అప్పటి నుంచి రజితకి ట్రైన్ ఫోబియా వచ్చిందని ఆ దెబ్బతో నిర్మాతలకు తాను కొన్ని రూల్స్ పెట్టానని అప్పుడు జరిగిన విషయాలను అలీతో సరదాగా షో లో పంచుకున్నారు.. !

మరింత సమాచారం తెలుసుకోండి: