త్వరలోనే ఆహా లో జూన్ నెలలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందిస్తామని ఇప్పటికే తెలియజేసిన ఓటీటీ, ఇక అందుకు తగ్గట్టుగానే జూన్ నెలలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక ఇందులో భాగంగానే జూన్ నెలలో క్రాక్‌,గాలి సంపత్‌, నాంది, జాంబి రెడ్డి, సుల్తాన్‌, చావు కబురు చల్లగా, థ్యాంక్ యు బ్రదర్, అనుకోని అతిథి వంటి బ్లాక్‌ బాస్టర్ సినిమాలతో పాటు వెబ్ షోస్‌, సీరీస్‌, ఒరిజినల్స్‌తో సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి మన ముందుకు రాబోతోంది.
బ్లాక్‌ బాస్టర్ సినిమాలతో , అదిరిపోయేలా జూన్ నెలలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది 'ఆహా'. వారానికో సినిమా చొప్పున నాలుగు డిఫరెంట్ మూవీస్ ఆహా లో ప్రీమియర్ కానున్నాయి. జూన్ మొదటి వారం కాలా సినిమా, అంటే జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఇక ఇక జూన్ రెండవ వారంలో అంటే జూన్ 11 నుండి కేరాఫ్ కంచరపాలెం సినిమాతో బాగా ఆకట్టుకున్న యువ నటుడు కార్తీక్ రత్నం. ఇతనితో  పాటు  నవీన్ చంద్ర, డైలాగ్ కింగ్ సాయి కుమార్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా  " అర్ధ శతాబ్దం " సినిమా. ఈ సినిమాను రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేయగా, రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ నిర్మించారు. ఇక ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.
మమ్ముట్టి నటించిన " వన్ " సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది 'ఆహా'. సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, జూన్ నాలగవ వారంలో  అంటే జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది.  హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్  " ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ " (ఐఎన్‌జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది ఆహా.  ప్రియదర్శి, నందినీ రాయ్, krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. జూన్ 18న  ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: