కేరళ నుంచి వచ్చి తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తన మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటూ, తనదైన శైలిలో షో లకు యాంకరింగ్ వహిస్తూనే, ఆడియో ఫంక్షన్లు కూడా చేస్తూ, స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా బుల్లితెరపై మహారాణిలా తన ప్రస్థానాన్ని పదిలం చేసుకుంటోంది యాంకర్ సుమ. ఇక అంతే కాదు మోస్ట్ పవర్ఫుల్ యాంకర్ గా కూడా పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న క్యాష్ షో, అలాగే స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ట్ మ్యూజిక్, అలాగే జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలకు సుమ యాంకరింగ్ వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ షో లకి వచ్చే పలు సెలబ్రెటీలను తనదైన శైలిలో ఆడుకుంటూ ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక బుల్లితెరపై ఈ మూడు షో ల నుంచి మంచి టీ ఆర్ పీ రేటింగ్ సొంతం చేసుకోవడంతో పాటు తన యాంకరింగ్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే తాజాగా జీ తెలుగు లో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఎప్పటిలాగే రవి తో కలిసి సుమ ఈ షో లో యాంకరింగ్ చేస్తుండగా, ఈ సారి ప్రోమో లో మాత్రం కేవలం రవి మాత్రమే కనిపించారు. అయితే ఈ వారం ప్రోమో లో సుమ కనిపించలేదు. ఇక ఈ ప్రోమో చూసినవారు ఈ వారం మాత్రమే సుమ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో కనిపించరా? లేక పర్మనెంట్ గానే సుమ ఈ షో కి దూరం అవుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం, సుమ నుంచి సమాధానం రావాల్సిందే.

అయితే ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు సుమ ఉంటే ప్రోమో మరింత బాగుండేదని కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చాలా రోజుల నుంచి ప్రసారం అవుతున్న ఈ షో లో సుమ యాంకరింగ్ లేకుండా మొదటిసారి ప్రోమో రిలీజ్ కావడం గమనార్హం. సుమ లేకపోవడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: