మా టీవిలో గత అయిదు సీజన్ లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇక చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 12 వారంలో ఉన్నాము. 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా ప్రారంభం అయిన బిగ్ బాస్ షో ఇప్పుడు ఎనిమిది మందికి చేరుకుంది. టైటిల్ గెలిచే సత్తా ఉన్న చాలా మంది ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయి ప్రేక్షకుల్లా మారిపోయారు. ఇప్పుడు హౌస్ ఎలా కొద్దీ మందిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఊహాగానాల ప్రకారం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా సన్నీ మరియు షణ్ముఖ్ జస్వంత్ లకు మాత్రమే ఉన్నాయని మీడియా సమాచారం ప్రకారం తెలుస్తోంది. కానీ ఈ గాసిప్ లను నమ్మడానికి వీలు లేదు.

ఈ వారం కూడా ఒక్క కెప్టెన్ తప్ప మిగిలిన 7 గురు ఇంటి సభ్యులు ఇంటి నుండి వెళ్ళడానికి నామినేట్ కాబడ్డారు. వారిలో డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనే విషయంపై రూమర్లు షికారు చేస్తున్నాయి. అయితే నిన్న హౌస్ లో జరిగిన దానిని బట్టి ఈ వారం ఎలిమినేషన్ నుండి ఆర్ జె కాజల్ సేవ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం చాలా అమందికి మింగుడు పడడం లేదని తెలుస్తుంది. నిన్న హౌస్ లోకి కాజల్ భర్త మరియు పాప వచ్చిన విషయం తెల్సిందే. ఒకవేళ ఈ వారం కనుక కాజల్ నామినేట్ అయ్యే అవకాశం ఉంటే ఆదివారం ఇంటి నుండి వెళ్ళిపోతది కనుక ముందే ఇంటి సభ్యులను ఇంటిలోకి పంపే వారు కాదని లాజిక్ కనబడుతోంది.

దీనిని బట్టి ప్రస్తుతానికి నామినేషన్ లో ఉన్న కాజల్ ఈ వారం సేవ్ అయినట్టే అని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియకపోయినా... కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: