తెలుగు బుల్లి తెరపై స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ లో టాప్ మోస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సీరియల్స్ లలో "కార్తికదీపం" సీరియల్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పాలి. అయితే ఈ మధ్య ఇంకా ఎంతకాలం ఈ సీరియల్ సాగతీస్తారు ఇకనైనా కావాలంటే సీరియల్ ని ఎండ్ చేసి కార్తిక్ ని అలాగే దీపని ఒకటి చేయండి అంటూ సోషల్ మీడియా వేదికపై కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ సీరియల్ వంటలక్క కష్టాలకు కరగని వారు లేరు , ఆమెకు మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు , స్టార్ సినీ సెలబ్రిటీ రేంజ్ లో ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ వంటలక్క మ్యానియా మామూలుగా లేదు.

అయితే డైరెక్టర్ సీరియల్ రూట్ మార్చిన విషయం తెలిసిందే. వంటలక్కను డాక్టర్ బాబును కలిపి కథను కొత్త మలుపు తిప్పాడు. అయితే ఇపుడు మరో ట్విస్ట్ ఉండబోతుంది అట. ఇక త్వరలోనే కథను కొత్త కోణంలో మళ్లించనున్నారట. సీరియల్ ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇపుడు ఉన్న కార్తిక్ , దీప పిల్లలను, అలాగే మోనిత కొడుకును త్వరలోనే పెద్దవాళ్ళు అయినట్లుగా యుక్త వయసుకు వచ్చిన వారిలాగా చూపించబోతున్నారట. 10 ఏళ్ల తరవాత అని బోర్డ్ చూపించి కథను సరికొత్తగా చూపించబోతున్నారు అని సమాచారం.

అయితే దీప , కార్తిక్ లకు బదులుగా వేరే సీనియర్ నటులను ఉంచి....మోనిత కొడుకు పాత్రలో కార్తిక్ ఆ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీప మాత్రం ఈ సీరియల్ లో ఇకపై కనిపించరు అని సమాచారం. వంటలక్క పిల్లల పాత్రలో వేరే ఇద్దరు కొత్త హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై సీరియల్ మామూలుగా ఉండదు అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. వంటలక్క ఎలీదంటే ఈ సీరియల్ ను ఆదరిస్తారా అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: