నగరి mla గా రోజా అసెంబ్లీ లో బాగా పేరు సంపాదించుకుంది.. అలాగే జబర్దస్త్ లో జడ్జిగా ఉండి కూడా తన పంచులతో, ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే ఎన్నో సంవత్సరాలనుంచి జబర్దస్త్ లోనే రోజా తన స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం రోజా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను, అటు జబర్దస్త్ కామెడీ తో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఇక దీనితో పాటే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది రోజా. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా జరిగిందని చెప్పవచ్చు.. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఈ సారీ సింగర్ మనో రోజా పై పొగడ్తల వర్షం కురిపించాడు.. ప్రస్తుతం జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా జడ్జి గా వ్యవహరిస్తున్నాడు సింగర్ మనో.. ఇక తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటీ విడుదల కాగా.. అందులో రాకింగ్ రాకేష్ ఆడవాళ్ళ గురించి స్కిట్ చేస్తున్న నేపథ్యంలో.. మధ్యలో ఎంట్రీ ఇచ్చి మనో రోజా వైపు చూపిస్తూ కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. ఆ వాక్యాలు అని ప్రస్తుతం ఈ ప్రోమో లో వైరల్ గా మారుతున్నాయి. రోజా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంది కాబట్టి ఆమె ఎమ్మెల్యే అయిందని పొగిడేశాడు మనో

సింగర్ మనో ఇలా చేయడంతో రోజా తన రెండు చేతులను పైకెత్తి దండం పెట్టి అభినందనలు తెలియజేసింది. ఇక ఆ తర్వాత మనో రష్మీ గురించి కూడా తెలియజేయడం జరిగింది.. ఇక రష్మీ పై పొగడ్తలు వర్షం కురిపించడంతో ఆమె కూడా బాగానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇక సింగర్ మనో ఆడవాళ్ళ విషయంలో బాగానే మాట్లాడాడు అంటూ కొంతమంది కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇక సుధీర్ తో కూడ రోజా ఒక స్కిట్  చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: