మొదటిసారిగా అదుర్స్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పటాస్ షో ద్వారా యాంకరింగ్ గా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఆ తరువాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది. శ్రీముఖి ఏ షో చేసినా కూడా బాగా యాక్టివ్ గానే చేస్తుంది. అందుచేతనే శ్రీముఖి ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఆమె చేసే అల్లరి మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇక గతంలో కూడా బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో పలు సినిమా అవకాశాలు కూడా వెలువడ్డాయి శ్రీముఖి. కానీ అవి అంతగా ఆకట్టుకోలేక పోవడంతో తన కెరీర్ని యాంకరింగ్ గానే కొనసాగుతోంది.
ఇక దీంతో ప్రస్తుతం శ్రీముఖి డిమాండ్ పెరిగి పోతోంది అని చెప్పవచ్చు.. నిత్యం ఎప్పుడూ తన ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే శ్రీముఖి కి మరొక ఆఫర్ సొంతం చేసుకుంది.. త్వరలోనే ఈ టీవీ లో మొదలయ్యే.. జాతి రత్నాలు అనే కామెడీ షోకి యాంకరింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈమె వరుసగా అవకాశాలు సంపాదిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి