తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఆవకాయ బిర్యాని చిత్రం ద్వారా మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొత్తానికి బిందుమాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే తన హడావిడి చేసింది అని చెప్పవచ్చు. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. దీంతో ఓటిటీ ప్రేక్షకులంతా ఆమె వైపు మళ్లారు.

ఇక ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకుంది. అ తరువాత హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం వరకు ఇంటర్వ్యూలు ఇస్తు చాలా బిజీగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం బిందుమాధవి వివాహం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకోబోతోంది గాసిప్ కూడా వినబడుతున్నాయి.


తాజాగా  ఈ విషయంపై బిందుమాధవి తండ్రి స్పందించడం కూడా జరిగింది. ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే తన వివాహం చేసుకోవచ్చని ఆమె తండ్రి తెలియజేశారు ఇంజనీరింగ్ చదివేటప్పుడు పెళ్లి విషయంలో చాలా ఒత్తిడి చేశామని.. అప్పుడు చాలా మంచి సంబంధాలు కూడా  వచ్చాయని తనను ఒత్తిడి చేయడం ఇష్టం లేక వదిలేశాను తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను కానీ ఆమె ఒక్కటి ఒప్పుకోలేదు అని తెలియజేశారు. మొత్తం నేను చూసుకుంటాను నాన్న.. నేను చిన్న పిల్లని కాదు కదా అంటూ అనడంతో ఇక అప్పటినుంచి ఆ విషయాన్ని తన మధ్య తీసుకురావా లేదని బిందుమాధవి తండ్రి తెలిపారు. తనకు ఇష్టం ఉన్నప్పుడు వివాహం చేసుకుంటానని తెలియజేసిన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: