తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ ను పరిచయం చేయనవసరం లేదు.. ఎందుచేత అంటే ఒక నటుడిగా, సుడిగాలి సుదీర్ దాదాపుగా ఏడు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ షో లోనే ఉన్నారు. అప్పుడప్పుడు నటుడిగా కొన్ని సినిమాలలో హీరోగా నటించి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం హీరో స్థాయి నుండి అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాడు.. అసలు సుదీర్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అర్థం కాలేక అభిమానులు సైతం జుట్టు పీక్కుంటున్నారు.


ఒకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపిస్తారు మరొకవైపు వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఈ కారణం వల్లే జబర్దస్త్ లో ప్రస్తుతానికి కనిపించడం లేదని వార్తలు బాగా వైరల్గా మారాయి. అయితే ఇప్పుడు తాజాగ యాంకర్ అనసూయ తో కలిసి ఒక ప్రముఖ ఛానల్ లో రియాల్టీ షోల్లో యాంకరింగ్ చేస్తు బిజీగా ఉన్న సుడిగాలి సుదీర్ అ షో కు యాంకర్ గా ఎలా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సుధీర్ జబర్దస్త్ కాకుండా మరి ఏం చేసినా కూడా జనాలు ఊరుకోవడం లేదు.

ఢీ షో  నుండి తప్పుకున్న సమయంలో కూడా సుధీర్ ని తీవ్రమైన స్థాయిలో ఆయన అభిమానులే విమర్శించారు. కొందరు మాత్రం సుధీర్ ని కావాలని తప్పించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ లో కూడా ఈయన కనిపించడం లేదు. రోజా వెళ్ళిపోవడమే ఆలస్యం వెంటనే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుదీర్ కూడా వెళ్లిపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాం చేస్తాం అంటూ గతంలో సుధీర్ మరియు గెటప్ శ్రీను తెలియజేశారు. కానీ ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కనిపించడం లేదు అంటే అభిమానులు సైతం గందరగోళానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: