
ఇక ఈమెకు ఒక కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం రాగా రేమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈసారి హోస్ట్ గా రానా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .ఇక ఈ షోలో పాల్గొనడానికి రష్మీ గౌతమ్ కూడా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా రష్మి గౌతమ్ జబర్దస్త్ లో ఒక్కోషోకి రెండు లక్షల రూపాయల వరకు పారిపోషకం అందుకుంటున్న విషయం తెలిసిందే..అందుకే దీనికి తగ్గట్టుగా ఆమె పారితోషకం కావాలని డిమాండ్ చేస్తుంది.
ఇక ఆ రేంజ్ లో పారితోషకం అంటే షో నిర్వాహకులు కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ రేంజ్ లోనే తనకు పారితోషకం ఇస్తే పాటిస్పేట్ చేస్తానని లేకపోతే రాను అని ఖరాఖండిగా కూడా చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె పెడుతున్న కండిషన్ కి బిగ్ బాస్ నిర్వహకులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. మొత్తానికి అయితే రష్మి గౌతమ్ చేస్తున్న డిమాండ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో హోస్ట్ గా పనిచేస్తున్న ఈమె ఇటీవలే సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.