తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గతంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. న్యూస్ రీడర్ గా మారి జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించిన అనసూయ ఆ తర్వాత పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి భారీ క్రేజ్ అందుకుంది. అనసూయకు సినీ కెరియర్ టర్నింగ్ అవ్వడానికి ముఖ్య కారణం రంగస్థలం సినిమా అని చెప్పవచ్చు.. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది అనసూయ. పుష్ప సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది.


అప్పటినుంచి అనసూయకు సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు కూడా గుడ్ బై చెప్పేసి మరి సినిమాలలో నటిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో బుల్లితెరపై హాట్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది. తాజాగా అనసూయ క్షమాపణలు చెబుతోంది. మరి అనసూయ క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే.. అనసూయ బిజీ షెడ్యూల్ కారణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదని అందుకే తన అభిమానులకు మొదటిసారి క్షమాపణలు కోరుతూ ఒక పోస్టుని షేర్ చేసింది.


ఈమె ఫ్యాన్స్ కు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల నిరాశగా ఉన్నారని భావించి అనసూయ ఇలా క్షమాపణలు తెలియజేసిందట. ఇటీవల కాలంలో అనసూయ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ వస్తోంది. ప్రతి పాత్రకు కూడా న్యాయం చేసి తనలోని నటనను పెంచేస్తూనే ఉంది అనసూయ. అంతేకాకుండా ఎంతో మంది అనసూయ పైన విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఇమే దుస్తులపైన కూడా విపరీతమైన ట్రోలింగ్ చేసినప్పటికీ వీటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటుంది అనసూయ. ఏది ఏమైనా అనసూయ మొదటిసారి తమ అభిమానుల కోసం క్షమాపణలు చెప్పింది. అయితే అభిమానులు ఈ విషయానికే లవ్ ఎమోజి సింబల్స్ షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: