టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తక్కువ కాలంలోనే ఆఫర్లతో కోట్ల సంఖ్యలో వినియోగదారులకు జియో చేరువయింది. తొలుత ఆల్ కాల్స్ ఫ్రీ అంటూ వినియోగదారులకు చేరువైన జియో 2019 డిసెంబర్ నెలలో ఔట్ గోయింగ్ కాల్స్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. టారిఫ్ రేట్లను కూడా గతంతో పోలిస్తే భారీగా పెంచింది. 
 
తాజాగా జియో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జియో డేటా టారిఫ్‌లను భారీగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక జీబీ 15 రూపాయలుగా ఉన్న డేటా ధరను 20 రూపాయలకు పెంచాలని జియో ట్రాయ్ కు లేఖ రాసింది. డేటా టారిఫ్ ధరలలో మాత్రమే మార్పులు చేయనున్నామని వాయిస్ కాల్స్ ధరల విషయంలో ఎటువంటి మార్పులు చేయడం లేదని జియో పేర్కొంది. 
 
పెంచిన ధరలను రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలలలో అమలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అన్ని టారిఫ్ లకు పెరగనున్న డేటా రేట్లు వర్తించేలా నిబంధనలలో మార్పులు చేశామని జియో చెబుతోంది. జియో ఒకేసారి డేటా చార్జీలను పెంచకుండా రెండు మూడు విడతల్లో పెంచనున్నట్లు సమాచారం. జియో టారిఫ్ రేట్లను, చార్జీలను పెంచుతుండటంతో కొత్త చందాదారుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: