ప్రస్తుతం టెలికాం కంపెనీలు జీయో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ మొబైల్ ప్లాన్ల చార్జిలను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ వేళ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ యూజ‌ర్ల గుడ్ న్యూస్‌. అతి త‌క్కువ ధ‌ర‌లోనే  జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ అందిస్తున్న‌ అదిరిపోయే ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుని.. వాటిలో మీకు న‌చ్చింది సెలెక్ట్ చేసుకోండి.

 

అందులో ముందుగా ఎయిర్‌టెల్‌ రూ.98 ప్లాన్‌.. ఎయిర్‌టెల్‌లో రూ.98 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మ‌రియు 6 జీబీ డేటా యూజ్ చేసుకోవచ్చు. మ‌రియు ఎయిర్‌టెల్ అందిస్తున్న మ‌రో ప్లాన్‌ రూ.149 ప్లాన్.. ఎయిర్‌టెల్‌లో రూ.149 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటా యూజ్ చేసుకోవ‌డంతో పాటు 300 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఉచితం. 

 

వొడాఫోన్ రూ.129 ప్లాన్‌..  వొడాఫోన్‌లో రూ.129 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. అలాగే వొడాఫోన్ అందిస్తున్న మ‌రో ప్లాన్ వొడాఫోన్‌ రూ.149 ప్లాన్‌.. దీన్ని రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా యూజ్ చేసుకోవచ్చు. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ.

 

జియో విష‌యానికి వ‌స్తే.. జియో రూ.129 ప్లాన్.. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా యూజ్ చేసుకోవచ్చు.  జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. అలాగే జియో అందిస్తున్న మ‌రో ప్లాన్ జియో రూ.149 ప్లాన్.. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1జీబీ చొప్పున 24 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 300 కాల్స్ చేసుకోవచ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: